మరువలేనిది నా యేసుని ప్రేమ మధురాతి మధురం నా ప్రియుని ప్రేమ
ప్రేమా..ప్రేమా ..ప్రేమా..నా యేసు ప్రేమా ||మధుర||
1. ఇహలోక ఆశలతో అంధుడనేనైతిని-
నీ సన్నిధి విడిచి నీకు దూరమైతిని
చల్లని స్వరముతో నన్ను నీవు పిలిచి
నీ సన్నిధిలో నిలిపిన నీ ప్రేమ మధురం
ప్రేమా..ప్రేమా..ప్రేమా..నా యేసు ప్రేమా ||మధుర||
2. పర్వతములు తొలగిన మెట్టలు గతి తప్పిన
ఎగసిపడే అలలతో కడలి గర్జించిన
మరణపు ఛాయలే దరిచేరనీయక
కౌగిట దాచిన నీ ప్రేమ మధురం
ప్రేమా..ప్రేమా..ప్రేమా..నా యేసు ప్రేమా ||మధుర||
3. నీ సిలువ ప్రేమతో నన్ను ప్రేమించి
మార్గమును చూపి మన్నించితివి -
మరణపు ముల్లును విరిచిన దేవ
జీవము నొసగిన నీ ప్రేమ మధురం
ప్రేమా...ప్రేమా.. ప్రేమా..నా యేసు ప్రేమా||మధుర||
No comments:
Post a Comment