అన్ని నామములకన్న పైనామము - యేసుని నామము
ఎన్ని తరములకైన ఘనపరచదగినది - క్రీస్తేసు నామము
యేసు నామము జయం జయము -సాతాను శక్తుల్ లయం లయము (2)
హల్లేలూయా హోసన్న హల్లేలూయా హల్లేలూయా ఆమెన్ (2)
1.పాపముల నుండి విడిపించును - యేసుని నామము (2)
నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును - క్రీస్తేసను నామము (2) ||యేసు||
2.సాతాను పై అధికారమిచ్చును - శక్తి గలిగిన యేసు నామము (2)
శత్రు సమూహముపై - జయమిచ్చును - జయశీలుడైన యేసు నామము(2) ||యేసు||
3.స్తుతి ఘన మహిమలు చెల్లించుచు - క్రొత్త కీర్తన పాడెదము -
జయ ధ్వజమును పైకెత్తి కేకలతో - స్తోత్రనాదము - చేయుదుము ||యేసు||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment