31 July 2020

Thallila Lalinchunu | తల్లిలా లాలించును

తల్లిలా లాలించును - తండ్రిలా ప్రేమించును (2)
ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును
చంక పెట్టుకొని కాపాడును యేసయ్యా ||తల్లిలా||

1. తల్లియైన మరచునేమో నేను నిన్ను మరువను
చూడుము నాఅరచేతులలో- నిన్ను చెక్కియున్నాను
నీ పాదము తొట్రిల్లనియ్యను నేను
నిన్ను కాపాడువాడు కునుకడు నిదురపోడు
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా||తల్లిలా||

2. పర్వతాలు తొలగవచ్చు - తత్తరిల్లు మెట్టలన్ని 
వీడిపోదు నా కృప నీకు - నా నిబంధన తొలగదు 
దిగులుపడకు భయపడకు - నిన్ను విమోచించెద
నీదు భారమంత మోసి - నాదు శాంతి నొసగెద
అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా||తల్లిలా||

DOWNLOAD MP3 SONG HERE 👇

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...