Idigo Deva Naa Jeevitham | ఇదిగో దేవా నా జీవితం

ఇదిగో దేవా నా జీవితం 
ఆపాదమస్తకం నీ కంకితం .....
శరణం నీ చరణం (2) ||ఇదిగో||

1.పలుమార్లు వైదొలగినాను - పరలోక దర్శనమునుండి
విలువైన నీ దివ్య పిలుపుకు - నే తగినట్లు జీవించనైతి
అయినా నీ ప్రేమతో - నన్ను దరి జేర్చినావయా 
అందుకే గైకొనుమా దేవా ఈ నా శేష జీవితము 

2.నీ పాదముల చెంత చేరి - నీ చిత్తంబు నేనెరుగ నేర్పు 
నీ హృదయభారంబు నొసగి - ప్రార్థించి పనిచేయనేర్పు
ఆగిపోక సాగిపోవు - ప్రియ సుతునిగ పనిచేయనిమ్ము
ప్రతిచోట నీ సాక్షిగా - ప్రభువా నన్నుండనిమ్మయా (2)

3.విస్తార పంట పొలమునుండి - కష్టించి పనిచేయ నేర్పు
కన్నీటితో విత్తుమనసు - కలకాలం మరినాకునొసగు (2)
క్షేమ క్షామ కాలమైన - నిన్ను ఘన పరచే బ్రతుకు నిమ్మయా
నశియించు ఆత్మలన్ - నీ దరిచేర్చు కృపనిమ్మయా (2) ||ఇదిగో||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: