310
యేసు హృదయద్వారమును తట్టుట
రా - భైరవి, తా - ఆది
హృదయ మనెడు తలుపునొద్ద - యేసు నాధుండు = నిలచి సదయుడగుచు దట్టు చుండు - సకల విధములను ||హృదయ||
1.పరుని బోలి నిలుచున్నాడు - పరికించి చూడ = నతడు పరుడుగాడు రక్షకుండు - ప్రాణ స్నేహితుడు ||హృదయ||
2.కరుణాశీలుం డతడు గాన - గాచి యున్నాడు = యేసు - కరుణ నెఱిగి గారవింప - గరము న్యాయంబు ||హృదయ||
3.ఎంతసేపు నిలువబెట్టి - యేడ్పింతు రతని = నాత - డెంతో దయచే బిలుచు చున్నా - డిప్పుడు మిమ్ములను ||హృదయ||
4.అతడు మిత్రు డతడు మిత్రు - డఖిల పాపులకు = మీర లతని పిలుపు వింటి రేని - యతడు - ప్రియుడగును ||హృదయ||
5.జాలిచేత దన హస్తముల - జాపి యున్నాడు = మిమ్ము - నాలింగనము సేయ గోరి - యనిశము కని పెట్టు ||హృదయ||
6.సాటి లేని దయగల వాడు - సర్వేశు సుతుడు = తన - మాట వినెడు వారల నెల్ల - సూటిగ రక్షించు || హృదయ||
7.చేర్చుకొనుడి మీ హృదయమున శ్రీ యేసు నాధు = నతడు - చేర్చు కొనుచు మీకిచ్చును - చిర జీవము గృపను ||హృదయ||
8.అతడు తప్పక కలుగజేయు - నఖిల భాగ్యములు = మీర - లతని హత్తుకొందు రప్పు - డానందముతోడ ||హృదయ||
9.బ్రతుకు శాశ్వతంబు కాదు - పరికించి చూడ = గాన బ్రతికి యుండు కాలముననే - ప్రభుని గొలువండి ||హృదయ||
- పులిపాక జగన్నాదము
1 comment:
So helpful.Thanks Sir
Post a Comment