మన పక్షముగా ఉండువాడు దేవుడే


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪
 
 ✝️*మన పక్షముగా ఉండువాడు దేవుడే*✝️

దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధియెవడు?
రోమా. 8:31 

దేవుడు ప్రేమాస్వరూపి ఆయన తన ప్రజల పట్ల తనను నమ్మిన వారి యెడల ప్రేమ చూపించేవాడు. దేవుడు నేను తలపెట్టిన కార్యం, ఉద్యోగం, పెళ్లి ఇంకా ఏదైనా జరుగుతుందా లేదా అని ఆలోచించే కంటే నీ మాటలు దేవుని పట్ల నమ్మకం, స్తుతి, దేవుడు నాకు కార్యం చేస్తాడు అని నిశ్చయతతో కూడినదై ఉండాలి. వాటిలో ఏ ఒక్కటైనా నిజమా కాదా అన్న సందేహాన్ని నీవు వ్యక్తపరచుకూడదు. దేవుడు ఆయనను నమ్ముతున్న నీ పక్షాన ఉన్నాడని నీవు నమ్మాలి. నీతో నీలో ఆయన ఉన్నాడని నమ్మాలి. ఈ లోకపు శత్రువైనా, నీలోని శత్రువైన(సాతాను) నీ కోసం నీ పట్ల దేవునికున్న ఉద్దేశాలను ఓడించలేరు. ఎందుకు అంటే నీతో దేవుడు ఉన్నాడు కాబట్టి. తన విశ్వాసులు అందరికీ క్రీస్తు అత్యధిక విజయం లభించేలా చేస్తాడు. ఒక విశ్వాసి పై ఏ పద్ధతి ఉపయోగించి ఓడించాలన్న చివరకు అంతిమ విజయం ఆ విశ్వాసిదే .వారికి ఆ నమ్మకాన్ని ఇచ్చిన దేవుడు అంతము వరకు వారిని ఆ నమ్మకం లో ఉంచుతాడు. అటువంటి విశ్వాసిగా దేవుని పట్ల నమ్మకం కలిగి నీవు జీవించినప్పుడు దేవుడే నీ జీవితానికి విజయాన్ని ఇచ్చి ఆపద వచ్చినా నీ జీవిత అనుభవములలో నుంచి నేను క్షేమంగా ఉంచుతాడు. అలాంటి క్షేమం పొందుకోవటానికి దేవుని ప్రేమ నిత్యము నీకు తోడైయుండును గాక.

🛐 *ప్రార్ధన*🛐
ఓ ప్రభువా, నీవే నా ప్రభువుగా ఉండి,నా బ్రతుకులో నీ కార్యమును జరిగించి, అపవాది పై విజయమును అనుగ్రహించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments: