దేవుని తలంపులు నీవు చూడాలి


🙏ప్రభువు నామములో శుభోదయం🙏
⛪నేడు దిన ధ్యానము:-⛪
 
✝️ *దేవుని తలంపులు నీవు చూడాలి*✝️

యెహోవా నా దేవా, నీవు మా యెడల జరిగించిన ఆశ్చర్యక్రియలును మాయెడల నీకున్న తలంపులును బహు విస్తారములు.
కీర్తనలు 40:5

ఈ లోకపు అధికారికి నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉన్నా ఆ అధికారి నిన్ను స్వార్ధ ప్రయోజనాలకు వాడుకొని వదిలేస్తాడు. నీపట్ల అతనికి ఏ ఉన్నతమైన ఉద్దేశ్యం ఉండకపోవచ్చు. నిన్ను వాడుకోవడం తప్ప. నాకు నమ్మకంగా ఉన్నవాడు వీడిని ఉన్నతమైన స్థితిలో తీసుకొద్దాం అనే ఆలోచన కొంచమైనా చేయని ఈ లోకపు అధికారులకు నీవు సాగిలపడిమాకు. సర్వాధికారి అయిన దేవుడు ప్రతిక్షణం నీ గురించే ఆలోచిస్తున్నాడు. నీవు దేవుని పట్ల ఎటువంటి నమ్మకం కలిగియున్నావు అని గమనిస్తున్నాడు. ఆయనపై నీవు నమ్మకం పెట్టుకొన్నట్ట యితే నీవు ఊహించనన్ని మేలులు, ఉన్నతమైన స్థితి నీకిచ్చి నీ ద్వారా ఆయన ఉద్దేశ్యములను జరిగించుకుంటాడు. అందుకే పరమతండ్రిని ఆశ్రయించి, యెహోవా నా దేవా నా యెడల నీకున్న తలంపులు నాకు కనపరచు, వాటిని అనుసరించి నడవగలిగిన యోగ్యత నాకు కలుగజేయి అని ఆయనను నీవు వేడుకొన్నట్లయితే ఉన్నత స్థితికి నిన్ను చేర్చి నడిపిస్తాడు.నీవు మహోన్నతుని చాటున నివసిస్తేనే, నీ జీవితములో అన్ని విషయాలలో సమాధానమును, విశ్రాంతియు లభిస్తాయి. దేవుని ఉద్దేశ్యాలను ఎరిగి నడుచుకొను లాగున ఆయన నీకు తన జ్ఞానము అనుగ్రహించుగాక!   

 🛐*ప్రార్ధన:-* 🛐
నా దేవా నీ తలంపులను నాకు కనపరచి వాటిని అర్థం చేసుకొను కృపను అనుగ్రహించి వాటిని అనుసరించి నడుచు కొనునట్లు సహాయము చేయమని యేసు నామములో ప్రార్ధన చేస్తున్నాము తండ్రి. ఆమెన్!

👉 అన్ని శ్రమలను అనుభవించాలనే తలంపు ఉన్న వ్యక్తి ఏదైనా మంచిని గెలుచుకోవచ్చు. - మార్టిన్ లూథర్

No comments: