నా విమోచకుడు


🙏ప్రభువు నామములో శుభోదయం🙏

⛪ నేటి దిన ధ్యానము⛪

 ✝️*నా విమోచకుడు*✝️

నా విమోచకుడు సజీవుడనియు 
యోబు 19:25

తన వెంట ఉన్న దాస దాసీలు తన అసహ్యించు కున్నప్పుడు తన భార్య పిల్లలు కూడా యోబును అసహ్యించుకున్న సమయంలో ఈ లోకంలో శాశ్వత ప్రేమ చూపించే వారు కేవలం నా దేవుడే అని, వీరందరూ కూడా సమయానుకూలంగా మారిపోయారని, ఆశాశ్వత ప్రేమ చూపేవారని ఎరిగిన యోబు నన్ను రక్షించే వాడు, నన్ను విమోచించే వాడు కేవలం నా దేవుడే అని నమ్మిన గొప్ప భక్తుడు దావీదు.  కీర్తన 19:14 యెహోవా నా ఆశ్రయ దుర్గమా! నా విమోచకుడా అని మాట్లాడుతున్నాడు. తనను రక్షించేది దేవుడే అని పూర్తిగా నమ్మిన భక్తులను చూస్తున్నాము. మరి నీవు కూడా నీ జీవితములో ఎటువంటి ఆపదలు వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ అనారోగ్యం వచ్చినా యోబు వలె భయపడక, నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను. ఎంత జబ్బు చేసినా తనను దేవుడు మరణానికి అప్పజెప్పాడని తన శరీరముతో దేవుని స్తుతిస్తాననే అని యోబు యొక్క నమ్మకం ఉన్నత స్థాయికి అందుకున్నది. ఇది సంపూర్ణ నిశ్చయత గా మారింది.నీవు కూడా దేవుని పట్ల నమ్మకాన్ని ఉన్నత స్థాయిలో ఉంచుకుని నీ జీవితము యోబు వలె అధికమైన ఆశీర్వాదము పొందు కోవటానికి దేవుని యొక్క సహాయము, రక్షణ మీకు తోడై యుండును గాక!

🛐 *ప్రార్ధన* 🛐
యేసయ్య! నా జీవిత పరిస్థితి ఎలా ఉన్నా, నా అనుకున్న వారు ఛీదరించినా, ఆరోగ్యం క్షీణించినా, ఆస్తులన్నీ దూరమైనా, యోబును దీవించిన రీతిలో నన్ను దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

No comments: