04 November 2021

నిత్యము నిలచు ఆశీర్వాదములు

🙏ప్రభువు నామములో శుభోదయం🙏

 ⛪నేటి దిన ధ్యానము⛪
✝️ *నిత్యము నిలచు ఆశీర్వాదములు* ✝️

యెహోవా, నీవు ఆశీర్వ దించినయెడల అది ఎన్నటికిని ఆశీర్వదింపబడి యుండును. 
1 దిన. 17:27

ఈ వచనం అబ్రహాము యొక్క విశ్వాసం తన జీవితంలో క్రియారూపంలో నెరవేరుటను గమనించగలము. దేవుని మాటను బట్టి కుమారుడైన ఇస్సాకును అబ్రహము బలి యివ్వటం విశ్వాసము యొక్క విశిష్టతను వెల్లడి చేస్తుంది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు దేవుడు చెప్పిన ఆశీర్వాద వచనము అబ్రహము జీవితములో అనేక సంవత్సరముల తర్వాత నెరవేరుటను బట్టి దేవుని మాటలు నిత్యము నిలుచును అని, ఎన్నటికిని అవి ఆశీర్వాద వచనములు గానే కొనసాగ గలవు అని మరొకసారి ఈ వచనము ద్వారా వెల్లడి అగుచున్నది. అయితే నీ జీవిత అనుభవములు అబ్రహాము జీవిత అనుభవమును వలె విశ్వాస సహితమైన జీవితములు కలిగి యున్నావా? స్వపరీక్ష చేసుకొనుట మేలు కరమైనది గా ఉండును. నీవు ఆశీర్వదించబడిన విధానమును బట్టి నీ జీవితానుభవములు ధన్యకరం అగుటయే కాదు, దేవుని మహిమను వెల్లడి చేసే విధముగా నీవు ఉండగలవు. దేవుని ప్రవచనం నెరవేర్పు నీ జీవితానుభవములో నెరవేరులాగున దేవుని కృప నీకు తోడైయుండును గాక!
 
🛐*ప్రార్ధన*🛐
తండ్రి! నేను అబ్రహము వంటి విశ్వాసమును కలిగి యుండి ఎన్ని క్లిష్టమైన పరిస్థితులు ఏర్పడినా, వాటిని జయించు కృపను నాకు అనుగ్రహించి దీవించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమెన్!

No comments:

Recent Post

ప్రేమామృత్తధారలు చిందించిన Premamrutha daaralu chindinchina

677 రెండవ అనుబంధము 1.ప్రేమామృత్తధారలు చిందించిన యేసుకు సమమెవరు?  ఆ - ఆ - ఆ ప్రేమయెతానై నిలచి - ప్రేమవాక్కులనే బలికి ప్రేమతో ప్రాణము బెట్టి -...