విశ్వాసము నందు స్థిరులై యుండుట


🙏ప్రభువు నామములో శుభోదయం..🙏.
⛪నేడు దిన ధ్యానము:-⛪

✝️ *విశ్వాసము నందు స్థిరులై యుండుట

''నీవు నమ్మినయెడల దేవుని మహిమ చూతువు" 
యోహాను 11:40

దేవుని యెడల ప్రభువైన ఏసుక్రీస్తు యెడల పరిపూర్ణ విశ్వాసం నమ్మకం కలిగి ఉండవలెను అని వాక్యము తెలియజేస్తుంది. లాజరు చనిపోయిన సమాధి చేయబడిన తర్వాత సమాధి యొక్క రాయిని తొలగించుడని చెప్పగా లాజర్ యొక్క సహోదరి అయిన మార్త- ప్రభువా నా సహోదరుడు చనిపోయిన నాలుగు దినములైనది, వాసన కొట్టునని ఆయనతో చెప్పగా ఆమె అవిశ్వాసమును గమనించిన ప్రభువు, నీవు నమ్మిన యెడల దేవుని మహిమను చుతువు అని మాట్లాడారు. నిజమే నీ జీవితంలో నీవు తలపెట్టిన లేక నీ అవసరత కొరకు దేవుని అడిగినప్పుడు ఆయన నీకు తప్పక ఇస్తాడు అని నమ్మి అడగాలి అడిగిన తర్వాత దేవుడు ఇస్తాడో ఇవ్వడో అని తలoచక, నేను అడిగాను, నన్ను ప్రేమించు నా తండ్రి నాకు తప్పక ఇస్తాడు అని నమ్మి విశ్వసించినట్లయితే నీ నమ్మకాన్ని బట్టి దేవుని మహిమపరచగలవు. దేవుడు నీకు చేసిన కార్యాన్ని బట్టి నమ్మి విశ్వసించటమే కాదు గాని ఇతరులకు కూడా దేవుని కార్యాన్ని అనుభవంతో చెప్పగలగటం మరియు దేవుని మహిమను ఇతరులకు చూపించే వాడిని గా ఉండాలి. మోషే ఇశ్రాయేలీయులతో మీరు భయపడకుడి దేవుడు చేసే గొప్ప కార్యమును మీరు ఊరక నిలుచుండి చూడుడి అని విశ్వాసముతో చెప్పాడు, గొప్ప కృపా కార్యమును దేవుని వద్దనుండి పొందుకున్నాడు అటువంటి కృప నీకు కలుగును గాక!

🛐 *ప్రార్ధన:-* 🛐
ప్రియ ప్రభువా సాతాను క్రియలను, కుయుక్తులను, జయించుటకు శక్తి ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుచున్నాను యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్!

👉నిరంతరం పునరావృతం చేయడం వల్ల నమ్మకం కలుగుతుంది
            - రాబర్ట్ కొల్లియర్

No comments: