Yesuvale nannu maarchunatti యేసువలె నన్ను మార్చునట్టి

యేసువలె నన్ను మార్చునట్టి - ప్రతి అనుభవముకై స్తోత్రం
శిష్యునిగా నన్ను సిద్ధపరచే - ప్రతి అవమానముకై స్తోత్రం (2)
ప్రతి అరణ్యముకై తండ్రీ కృతజ్ఞతలు - అపవాదిపై నాకు జయమిచ్చావు
ప్రతి ఎడారికై తండ్రీ కృతజ్ఞతలు - జీవజలమై నన్ను తృప్తి పరచావు
నీవే జీవజలము - తండ్రీ… నీవే జీవజలము (2)

నిత్యత్వముకై నన్ను నడిపించే - ప్రతి సవాలుకై స్తోత్రం
సంపూర్ణునిగా నన్ను మార్చునట్టి - ప్రతి సమయముకై స్తోత్రం
ప్రతి కన్నీటికి తండ్రీ కృతజ్ఞతలు - నీ ముఖమును దర్శింప కారణమదే
ప్రతి ఓటమికి తండ్రీ కృతజ్ఞతలు - నీ సన్నిధిని పొందే సమయమదే
నీ సన్నిధి చాలు - యేసు… నీ సన్నిధి చాలు (2)

విశ్వాసములో నన్ను స్థిరపరచే - ప్రతి పరిస్థితికై స్తోత్రం
కృప నుండి కృపకు నడిపినట్టి - నీ కనికరముకై స్తోత్రం
ప్రతి శోధనకై తండ్రీ కృతజ్ఞతలు - నీలో ఆనందించే తరుణమదే
ప్రతి పరీక్షకై తండ్రీ కృతజ్ఞతలు - నీ విశ్వాస్యత మా యెడ రుజువాయె
నీవే చాలు యేసయ్యా - నీవుంటే చాలు యేసయ్యా (2)

No comments: