Yehova bhajana cheyandi | యెహోవా భజన చేయండి

17
దైవా రాధన
రా – నాదనామక్రియ,  తా – అట

యెహోవా భజన చేయండి - పాప - నరులారా యీ రీతి మరచి పోకండి ||యెహోవా||
 
1.యేసు పేరిట ప్రార్థనంబు - మన దోసములను బోగొట్టను వెరవు = భాసుర పరలోక సుఖము - కోటి - బాధలు - మనకున్న - సంతోషకరము ||యెహోవా||
 
2.యేసు క్రీస్తును గొలువండి - యేసు - దాసులతో వాదము లాడ కండి = మోసపు దారి విడువండి - దోష - రాసుల నుర్విలోఁ - జేసికొన కండి ||యెహోవా||
 
3.జీవ రక్షకుని నమ్మండి - నిత్య - సేవలో మెలఁగక చెడిపోవకండి భావించి యాత్మన్ వేఁడండి - దేవ - దేవుని నెడఁబాసి తెరవు విడకండి ||యెహోవా||
 
4.మాయ లోకపు భ్రాంతు ల్విడిచి - మను - ష్యాయువు భువిలోన జెల్లుటఁ దలఁచి = మాయ మార్గము లెల్ల మరచి - మోక్ష - మార్గము మన మున - మరవక తలఁచి ||యెహోవా||
 
5.కాయము నొసఁగిన ప్రభుని - యయిదు - గాయంబు లాత్మలోఁ గానంగ రాదా = ఆయు వస్థిర మని తెలిసి - మీరు - కాయ మాత్మయు నిపుడు - కర్తకు నిచ్చి ||యెహోవా||
                              - యేసుదాసు నర్సయ్య

No comments: