Vyoma Simhasanathuda | వ్యోమ సింహాసనస్థుఁడ యుర్వి

22
దేవుని ప్రభావ వర్ణన
రా – నాట, తా – అట
(చాయః యేసుక్రీస్తు దొరికెనేని)

¹వ్యోమ సింహాసనస్థుఁడ ²యుర్వి పాదపీఠస్థుఁడ ³మామకీన దయా మయుఁడ - మమ్ముఁగావుమో దేవుఁడ || వ్యోమ ||

1.⁴అంతరిక్ష లోకదీప - యద్భుతాదృశ్య స్వరూపా = యింత నీ మహిమనోప - నెంతది నా నాల్క చూప || వ్యోమ ||

2.గాలి టెక్కల పైనెక్కి - గాఢాంధకారమునందు = నేలికవై సంచరించు - నట్టి నిన్ను మ్రొక్కుచుందు || వ్యోమ ||

3.నీతి న్యాయ దీర్ఘశాంతా - నిర్మల ⁵దయా నితాంతా = ప్రీతినుంచవే ⁶శ్రీమంతా - పెద్దఁగా నా కాలమంతా || వ్యోమ ||

4.సర్వ భూలోక పూజితా సత్య సద్గుణ రాజితా = గర్వ దుస్స్వభా ⁷వాహితా - కావునన్నీ నాట పితా || వ్యోమ ||

5.నమ్మిన యీనన్నఁ తూల - నాడవు దీనాత్మపాలా = క్రమ్మి నీ ప్రేమతోఁ జాల - బ్రోతువు దయాలా ⁸వాలా || వ్యోమ ||
- మిక్కిలి సమూయేలు
________________________________
¹ఆకాశము. ²భూమి. ³నాది. ⁴ఆకాశము. ⁵విస్తారదయగలవాడ. ⁶సంపదగలవాడా. ⁷పగవాడు. ⁸ ఉనికిపట్టు.

No comments: