Come,Thou Almighty King
1.సర్వేశా ! రమ్ము నీ - సన్నిధి కాంతి నొ -
సంగు మాకు - సత్య సనాతన -
సర్వాధికారుఁడా - సదా మమ్మేలుము- సర్వోన్నతా!
2.నిత్యంపు వాక్యమా ! - నీదగు ఖడ్గము -
నిమ్ము మాకు - నీ నిజ భక్తులన్ -
నీ వాక్య ప్రియులన్- నింపు నీ యాత్మతో- నింపు మీర
3.రమ్ము మహాత్మ ! మా - కిమ్ము నీ యాత్మను -
రమ్ము వేగ - రక్తితో నిప్పుడు -
రమ్ము మా మధ్యకు- రక్షించు మమ్మును- రంజిల్లఁగన్
4.స్తోత్రం పవిత్రుఁడా !- స్తోత్రంబు త్ర్యేకుండా -
స్తోత్రం సదా - ధాత్రి నీ మహిమ -
నేత్రంబులు గను - మీ, “త్రాహిమాం” యని - వేఁడు వారిది.
- చార్లెస్ వెస్లీ
అను: ఒంగోలు దావీదు
No comments:
Post a Comment