Now thank we all our God
1.సర్వాద్భుతంబులన్ - సర్వత్రఁ జేయుకర్తన్ -
సర్వాత్మ లింతటన్ - శ్లాఘింపఁ జేరరండి -
మా రాకపోకలన్ - మమ్ వీడకుండను -
మా రక్షకుండిట్లే - మమ్మాదరించును.
2.మహా దయాళుఁడే - మా జీవకాలమంత -
సహాయమూరటన్ - సంతోషమిచ్చుగాక -
మహత్తు ప్రేమను - మాయందు నుంచును -
ఇహంబునన్ మమ్మున్ - ఎన్నండుఁ బ్రోచును
3.ప్రపంచపాలకా! - ప్రసిద్ధుఁడైన తండ్రీ ! -
సుపుత్ర దేవుడా ! - సుజీవమిచ్చు నాత్మ ! -
సంపూర్ణ త్ర్యేకుఁడా ! - ప్రఖ్యాతికల్గగా -
అపారసన్నుతి - నర్పింతు సర్వదా.
- మార్టిన్ రికార్డ్
అను: లెచ్ . హార్డ్స్
No comments:
Post a Comment