87
క్రీస్తుకు నమోనమః
రా – శంకరాభరణము, తా – అట
1.సర్వ లోక సం పూజ్యా - నమోనమో - సర్వ జ్ఞాన సంపూర్ణా - నమోనమో - సర్వ సత్య సారాంశా - నమోనమో - దేవా గావో ||
2.దీన భక్త మందారా - నమోనమో - దోష శక్తి సంహారా - నమోనమో - దేవ యేసావతార - దేవా గావో ||
3.దేవలోక ప్రదీపా - నమోనమో - భావలోక ప్రతాపా - నమోనమో పావనాత్మ స్వరూపా - నమోనమో - దేవా గావో ||
4.వేదవాక్యాదర్శ నావె - నమోనమో - వేద జీవమార్గం బీవె - నమోనమో - వేదవాక్కును నీవే - నమోనమో - దేవా గావో ||
5.శాపగ్రహివైతివి నాకై - నమోనమో - ప్రాణత్యాగివైతివి నాకై - నమోనమో - ప్రాయశ్చిత్తమైతివి నాకై - నమోనమో దేవా గావో ||
- చెట్టి భానుమూర్తి
No comments:
Post a Comment