Puvvu lantidi Jeevitham | పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది

పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది - గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది (2)
ఏ దినమందైనా ఏ క్షణమైనా (2)
రాలిపోతుంది నేస్తమా - 
ఆ.. వాడిపోతుంది నేస్తమా(2)

1. పాల రాతపైన నడిచినా గాని - 
పట్టు వస్త్రాలే నీవు తొడిగినా గాని (2)
అందలము పైన కూర్చున్నా గాని - 
అందనంత స్థితిలో నీవున్నా గాని
కన్ను మూయడం ఖాయం - నిన్ను మోయడం ఖాయం (2)
కళ్ళు తెరచుకో నేస్తమా - 
ఆ.. కలుసుకో యేసుని మిత్రమా (2) ||పువ్వు||

2. జ్ఞానమున్నదని నీవు బ్రతికినా గాని - 
డబ్బుతో కాలాన్ని గడిపినా గాని (2)
జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా - 
డబ్బు నిన్ను రక్షించదు తెలుసా
మరణము రాకముందే - అది నిన్ను చేరకముందే (2)
పాపాలు విడువు నేస్తమా – 
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||

3. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా - 
ధరలో మనకేది స్థిరము కాదుగా (2)
ఎంత సంపాదించినా వ్యర్ధము తెలుసా - 
ఏది నీతో రాదనీ తెలుసా
వాడిపోయి రాలకముందే - ఎత్తి పారవేయక ముందే (2)
పాపాలు విడువు నేస్తమా – 
ఆ.. ప్రభుని చేరు మిత్రమా (2) ||పువ్వు||

No comments: