46
ఉదయారాధన
రా – ఫీల్, తా – రూపకము
ప్రభువా నిన్నారాధింపను జేరితిమి యుదయ శుభకాంతి ప్రభవింపఁగా - దేవా నేఁడు - శుభకాంతి విరజిమ్మఁగా = విభవముగను ప్రభాకరముగను - విరియు నీ తేజంబెలర్పంగ - నభి దనంబులఁగూడి భక్తిని యాత్మతో సత్యంబుతోడను ||ప్రభువా||
1.ఇరులుం గమ్మిననుండి - యరుణోదయము దనుక - నరిగాపు నీవే కాదా - దేవా రాత్రి - యరిగాపు నీవే కాదా = విరివిగా మా హృదయ సీమల - నెరసి యుండిన చీఁకటులుఁబో - దరిమి శాంతంబైన మనసుల - దయఁబ్రసాదింపను భజింతుము || ప్రభువా ||
2.అనఘా నీ సాన్నిధ్య - మున నుండఁగా మా దు - ర్శనసుల నరి కట్టుమో - దేవా మా దు - ర్శనసుల శుచి జేయుము = వినయ భయ భక్తులుఁద లిర్పగ - వినుచు నీ వాక్యోపదేశము - లనిశమును ధ్యానింప నాత్మను - బనిచి తుదకుఁ బ్రసన్నమగుము || ప్రభువా ||
3.పనిపాటలలో మేమీ - దినము నీ కే మహిమ నొనఁగూర్ప నడిపించుమో - దేవా నిన్నే - ఘన పరచన్నడిపించుము = తనువు శ్రమచేబడలినను మా - దారి దుర్గమమైన కనంబడ - వనటఁజెందక నేది జేసినఁ - బ్రభువు కొఱకని చేయ నడుపుము || ప్రభువా ||
- మొలతాటి విద్యానందము
No comments:
Post a Comment