O Prabhunda Nin Nuthinchu | ఓ ప్రభుండా నిన్ నుతించు

31     
ఓ దేవా, నిన్ను స్తుతించుచున్నాము
రా - శంకరాభరణము,  తా - ఆది

1) ౹.ఓ ప్రభుండా నిన్ నుతించు చున్నాము వినయముతోడ
II.మా ప్రభుండ వంచు నిన్ను - మానక మేమొప్పుకొందు ||మో||

2)I.నిత్యుఁడవై తండ్రి లోకము - నిన్నారాధించుచు నుండు
II.సత్యదూతల్ మోక్షమందు - సర్వ ప్రధానుల్ సుభక్తిన్ -
. నిత్య మేక కంఠముతోడ - నిన్ గొనియాడు చున్నారు ||ఓ||

3) III.పరిశుద్ధ, పరిశుద్ధ - పరిశు, సేనల దేవా - ధర పరలోకంబులు నీ - వర మహిమతో నొప్పునటంచు ||నో||

4)I.కెరూబుల్ సెరూపుల్ - నిన్నుఁ గీర్తించు చున్నారహహా -
II.సారెకున్ నిన్నపొస్తలుల - సంఘము స్తోత్రించుచుఁడు
I.కూరిమిన్ బ్రవక్తల సంఘము - కొనియాడుచు నిన్ నుతియించు ||నో||

5) IV.మా మహా జనకా - నిను - మాన్యుఁడౌ పుత్రున్ బహు - ప్రేమగల మా పరిశుద్ధాత్మను బ్రీతితో సంఘము భువి నొపు కొసన్ ||ఓ||

6) V.నీవే క్రీస్తు రాజవు నిత్య కుమారుఁడవు నీ విలలో మానవులను గావఁగఁ బూనినయపుడు పావన కన్యా - గర్భంబున బుట్టుట - బహు దీనంబనక చావు శ్రమ నోడించి - సజ్జనులకు దివిఁ దెరచితివే ||ఓ||

7) I.నీవు దేవుని కుడి పార్శ్వంబున - నిత్యము మహిమాసీనుఁడవు -
II.నీవు మా న్యాయాధిపతివై - రావలయునని నమ్ముచుందుము
I.పావనంబౌ నీ రక్తంబున - సేవకులకుఁ దోడ్పడు మిపుడే || ఓ ll

8) IV.నిత్య మహిమములో - నిఁక - నీదు భక్తులతో - న - గత్యముగ లెక్కించుము వారలఁ - గని రక్షించుమి నీ సుజనంబు ||ఓ||

9) V.నీవు దీవించి నీ నిత్య స్వాస్థ్యంబు సు - జీవ మిడి వారలఁ బాలించి - లేవఁగ నెత్తుము సతతము ప్రీతిక్ ||ఓ||

10) III.ఓ ప్రభువా పాపములో - నుండ కుండఁగఁ దోడ్పడుము మా ప్రభువా కరుణించు మముఁ గరుణించుము దయతోడన్ ||ఓ||

11) II. ఓ ప్రభుండా నిన్ను నమ్మి - యున్న మాకుఁ బ్రేమఁ జూపు
I. శ్రీ ప్రభుండా నిన్నే నమ్మితి - సిగ్గునొంద నీయకుము||ఓ||
                             - మల్లెల దావీదు
_____________________________
చాయలోని భాగము లీవిధముగా పాడఁదగును:
I. పా, రిగాపా| దాసానీదా| పా దపమగరిస| రిసని దసపాడఁదగున
II. పా, రిగసా|మా, గపాదా|రీ, సనీదా|పామగారీ
III. సపపరిరీ,,|గపమగగా,,|గపమగమగరిస|రిగరిససా,, |మొ ,,
IV. పా, రిగాగర|గా,.., రిగ పా, ససాసా|పా., దప|సా. ససససస| మొ
V. పా,,మగరిగ॥ దా,, మగరిగ|సా,, మగరిగ| పాపససా,| మొ||

No comments: