Naaloni Aasha Naaloni Korika Ninnu | నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను

నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చూడాలని
నాలోని ఆశ నాలోని కోరిక నిన్ను చేరాలని
దేవా.. యేసయ్యా నిన్ను చూడాలని
దేవా… యేసయ్యా నిన్ను చేరాలని

1. జీసస్ ఐ వాంట్ టు వర్షిప్ యూ
జీసస్ ఐ వాంట్ టు ప్రెయిస్ యూ లార్డ్ (2)
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ
మై జీసస్.. ఐ వాంట్ టు సీ యూ.. ఫరెవర్

2. శ్రమలు నన్ను తరిమినా – విడువలేదు నీ కృప
వేదనలో నేను కృంగినా – లేవనెత్తెను నీ చేయి (2)
ఎన్ని యుగాలకైనను.. స్తుతులకు పాత్రుడా
తరతరాలు మారినా.. మారని దేవుడా ||జీసస్||

3. విరిగి నలిగిన మనస్సుతో నీ దరి చేరితి యేసయ్యా
మధురమైన నీ ప్రేమతో నన్ను నింపుము నా దేవా (2)
నా తుది శ్వాస వరకు దేవా.. నిన్నే కీర్తించెద
నా బ్రతుకు దినములన్ని.. నిన్ను పూజింతును ||జీసస్||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: