Na thoduga unnavadave | నా తోడుగా ఉన్నవాడవే నా చేయి

నా తోడుగా ఉన్నవాడవే - నా చేయిపట్టి నడుపు వాడవే 
నా పక్షమున నిలుచువాడవే - నా దైర్యము నీవె ఏసయ్యా 
యేసయ్యా ఏసయ్యా యేసయ్యా ఏసయ్యా
కృతజ్ఞత స్తుతులు నీకెనయ్యా ||నా తోడుగా|| 

1.నా అనువారు నాకు దూరమైనా - 
నా తల్లిదండ్రులే నా చేయి విడచిన (2)
ఏ క్షణమైనా నన్ను మరవకుండా ఆ..ఆ..
నీ ప్రేమతో నన్ను హత్తుకుంటివే (2) ||నా తోడుగా|| 

2.నా పాదములు జారీన వేళ - 
నీ కృపతో నన్ను ఆదుకుంటివే (2)
నీ ఎడమ చేయి నాతల క్రింద ఉంచి ఆ..ఆ..
నీ కుడి చేతితో నను హత్తుకుంటివే (2) ||నా తోడుగా||

3.హృదయము పగిలి వేదనలోన - 
కన్నీరు పొంగే పరిస్థితులలో (2)
ఒడిలో చేర్చి ఓదార్చువాడ ఆ.. ఆ..
కన్నీరు తుడిచిన నా కన్న తండ్రివే (2) ||నా తోడుగా||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: