Naa Rakshaka Yesunaadha | నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు

91                    క్రీస్తునకు స్తుతి
రా – శహన                               తా - ఆది
                 
నా రక్షకా యేసునాధ ఇమ్మానుయేలు - ఘోర పాపుల పాప భార విమోచక || నా రక్షకా ||

1. నిత్యకాలమునందు - నిజమైన దేవుని = సత్యవాక్యమై యున్న - స్వామి నిన్నుతియింతు || నా రక్షకా ||

2. సర్వ లోకంబులను - సత్యవాక్యమై యుండి = నిర్వహించిన దేవుని - నిజబాహువా స్తుతింతు || నా రక్షకా ||

3. దేవజనులకు - సువార్త దెలుప నభిషేకంబు = పూని నొందిన - దేవపుత్రుడ నుతియింతు || నా రక్షకా ||

4. దేవ మహిమ ప్రకాశ - దీనరక్షక మాను = ష్యావతారము దాల్చి - యావదాజ్ఞల దీర్చిన || నా రక్షకా||

5. పావనాద్భుతుడవై - పరమ జ్ఞానము దెల్పిన దేవస్వభావ ముద్ర - దేదీప్యుడా స్తుతింతు || నా రక్షకా ||

6. పాపాత్ములను గావ - శాపభారము క్రింద = నోపికతో నిల్చి - ప్రాపు జూపిన ప్రభువా || నా రక్షకా ||

7. ఈ వసుధను ప్రేమ - నెసగునట్లుగ జూపి = చావు గెల్చిన సర్వ - సామర్థ్యుడా స్తుతింతు || నా రక్షకా ||

8. ఘన దేవుని కుడి పార్శ్వమున - గూర్చుండి విజ్ఞప్తి = నొనరించు నా యేసు - వినయ స్తోత్రంబిదిగో || నా రక్షకా ||
                         - తిరుకోవళ్లూరి స్టీవెన్

No comments: