కల్వరిగిరిలోన సిల్వలో శ్రీయేసు
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)
పలు బాధలొందెను – ఘోరబాధలు పొందెను (2)
నీ కోసమే అది నా కోసమే (2)
1. ప్రతివానికి రూపు నిచ్చె - అతనికి రూపు లేదు (2)
పదివేలలో అతిప్రియుడు - పరిహాసముల నొందినాడు (2) ||నీ కోసమే||
2. వధ చేయబడు గొర్రెవలె - బదులేమీ పలుకలేదు (2)
దూషించు వారిని చూచి - దీవించి క్షమియించె చూడు (2) ||నీ కోసమే||
3. సాతాను మరణమున్ గెల్చి - పాతాళ మందు గూల్చి (2)
సజీవుడై లేచినాడు - స్వర్గాన నిను చేర్చినాడు (2) ||నీ కోసమే||
No comments:
Post a Comment