23
దేవుని స్తుతి
రా – ముఖారి, తా – చాపు
(చాయ: ఓ మాతండ్రి నీదు నామము)
ఎటుల నీకు స్తుతు లొనర్తుము - యెహోవ తనయ - యెటుల నీకుఁ నుతు లొనర్తుము = పటుతర పాపంబులనెడి - పంకమందుఁజిక్కి మదిని - దిటముఁ జెడిన మమ్ముఁబ్రోచి - దిక్కుఁజూపినట్టి యేసూ ||యెటుల||
1.పాపకూపమందు నుండగాఁ బాపా విమోచ - దాపుఁజేర్చి కాపు జూపితి = శాపగ్రస్తులైన మా - శాపము విముక్తిఁజేయ - నీ పవిత్ర రక్తమే నా - ప్రాపుగా నొసంగితివి ||యెటుల ||
2.భార భరితమైన యాత్మల - భారమును దీసి - భూరి సౌఖ్యములతో నింపను = భారకుండ - ఘోరమైన శ్రమలనొంది - మరణమొంది తిరిగిలేచి నీవు ధాత్రిి - మహిమ నొందినట్టి దేవ ||యెటుల||
3.నీతిహీనులమై యుండఁగా - నో కర్త మాదు - భీతులన్నిఁబాపి నీ కృపన్ = నీతి రక్షణవస్త్రములను - భాతిగ ధరింపజేసి - భూతలంబునందు నిన్ను - ఖ్యాతిగ సేవింపఁజేసితి ||యెటుల||
4.నిన్నుఁజేరి నిర్చలుండనై - యీ భూమియందు - నిన్నుఁ బోలి నడుచుకొనుటకై = తిన్నని మార్గమును జూపి - అన్ని కీడులను జయింపఁ - బన్నుఁగ విమలాత్మశక్తి - నున్నతముఁగ నిడిన యేసూ || యెటుల ||
5. పరమ రాజ్యమందు నిరతము - నీతోడనుండ - కరుణతోడ నెంచుకొంటివి = తిరిగి వచ్చి మమ్మును మీ చిరప్రకాశ పురమునందుఁ త్వరగఁ జేర్చియందు సుఖము - దిరముగా నొసంగుదేవ || యెటుల ||
- మాముడూరి సైమన్
No comments:
Post a Comment