Endamaavi Aashalatho | ఎండమావి ఆశలతో ఎందాక

ఎండమావి ఆశలతో... ఎందాక నీ పయనం -
ఎడారి దారులలో... ఎటువైపు నీ గమ్యం (2)
ఒక్కసారి చూడు యేసు వైపు నేడు -
చింతలన్ని తీర్చి చెంత చేర్చువాడు (2) ||ఎండమావి||

1.కలతతో కన్నీరా కన్నవారు లేరని - 
దిగులుతో ఉన్నావా ఏ దారి లేదని (2)
అవమాన వేదనలు నిన్ను అడ్డుకున్నాయా -
నిరాశ నిశీధిలో ఒంటరిగా మిగిలావా (2) ||ఒక్కసారి||

1. కన్నవారి కన్నా ప్రేమ చూపు వాడు -
కన్నీరు తుడిచి చెంత చేర్చుతాడు (2)
ప్రియమైన నా యేసు పరలోకపు తండ్రీ -
మార్గము తానై నన్ను నడుపుతాడు (2) ||ఒక్కసారి||
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: