86
యేసున కేమి సమర్పించుదును?
రా – ఆనందభైరవి, తా – అట
ఏమి నేను సమర్పింతు - యేసూ - యెట్లు నిన్ను స్తుతియింతు = ఏమి సమర్పింతు - హీనుఁడ నగు నేను - గామితార్థము లెల్ల - గలుగఁజేయు నీకు || నేమి ||
1. నేను మార్గముఁ దప్పియుండఁగ - నన్ను - నీవు కంటివి కరుణ నిండఁగ = దీనపాపులను - దృఢముగఁ బ్రోవను - దాన మిచ్చితివి - తనర నీ ప్రాణము|| నేమి ||
2. అందరి కొఱు కీవు తెచ్చిన - మిగుల - అందమైన నిత్య రక్షణ = అంది నిన్ను - పొందుగఁ జేసెద - నొందు మా నా నుతి - నుత్తమ ప్రభు క్రీస్తు || మేమి ||
3. నీ యందే యానంద మొందఁగ యేసు - నీదైన యాత్మ నాకందఁగ = జేయు మంచు నీకుఁ జేసెదఁ బ్రాణాన - నాయందు దయచేసి నా మనవి నాలించు || మేమి ||
4. నేను జేసిన యఘము లెల్లను - గర్త - నీ యెదుటఁ దలంచు కొందును = నేను సిగ్గు నొంది - నిజముగఁ గుందుచు నేను - వేఁడుకొందు - నీ క్షమాపణ కొరకు || నేమి ||
5. నన్ను నీవు స్థిరపరచుము - కర్త - యన్నిట నను బలపరుచుము = తిన్నని మార్గమున - దృఢముగ నేగుచు - నిన్ను నే స్తుతియింతు - నిండుగ నెల్లప్పు || డేమి ||
– పులిపాక జగన్నాధము
No comments:
Post a Comment