సాయంతన స్తవము
రా - శంకరాభరణము, తా - త్రిపుట
(చాయ: విమల హృదయ)
దినము గతియించెను - దిననాధుఁడ పరాద్రి - వెనుకడా గె - ని కమా - మునిమాపు సంస్తవముఁ గొనుము సంప్రీతిమై - ఘనుఁడ దేవా ||దినము||
1. సరవినంబరవీధి - సంజ కెంజాయలు - మురువుఁజూపె - ప్రభువా - దొరము నీ ముఖకాంతి - కిరణ జాలము మాపై - నెఱపరమ్ము ||దినము||
2. కటికి చీఁకటులు ది - కటములఁ గలిపియు - త్కటములైన - నీ చెం - గట నున్న నెట్టి సం - కటమేని మమ్ముఁ - దాఁకుటకు జంకు ||దినము||
3. తలఁపువలనను నోటి - పలుకువలనను జెనఁటి - పనులవల్ల - మేము - వలచి చేసిన పాప - ముల నెల్ల క్షమియింపు - మ లఘక్షాంతి ||దినము||
4. ముమ్మరమ్మగు శోధ - నమ్ములపై విజ - యమ్మునొంద - నీది నమ్ము మాకు సామ - ర్ఘ్య మ్మొసఁగితివి వంద - నమ్ము దేవ ||దినము||
5. ఈ దినము మాకు స - మ్మోదంబుతో నిచ్చి - యాదుకొన్న - వరమౌ - నీ దివ్యదానముల - కై దేవ ! మా కృత - జ్ఞతను గొమ్ము ||దినము||
6.అలసిన మా దేహ - ములకు వలసిన నిదురఁ - గలుగఁజేసి - నీదూ - తల హస్తములలో మ - మ్ములను దాఁచుము భద్ర - ముగను దేవ ||దినము||
7.అరుణోదయమునని - న్నర్చించు కొఱకు నీ - కరము సాంచి - మమ్ముు - త్వరగా మేల్కొల్పుము - స్వాస్థ్య ప్రదాతవై - పరమదేవ ||దినము||
8.దాత వీవె లోక - త్రాత వీవె మాకు - నేత వీవె - యేేసు - సూర్యుండవి - ఖ్యాతి మహిమలు నీకె - కలుగుఁగాక ||దినము||
– దాసరి మోజెస్
No comments:
Post a Comment