అర్పణ కీర్తన
(దావీదు కీర్తన 51 : 16-19)
రా–హిందుస్థానీ తోడి, తా– త్రిపుట
(చాయ:ఆహా,ఎంతటి శ్రమలు)
దహన బలి నీకు ననిష్టము - మరియు - దైవ బలులు విరిగిన యాత్మయే = యెహోవ దేవ విరిగి నలిగిన - యట్టి - హృదయం బలక్ష్యంబు సేయవు ||దహనం||
1.నీ కటాక్షముతో సీయోనున - కిపుడే - నెనరుతోడను మేలు చేయుమి = ప్రాకటంబుగను యోరూషలే - మునకు - బ్రాకారములను గట్టించుమి ||దహన||
2.అంతట నీతియుక్తంబు లౌ - బలుల - యాగముల సర్వాంగ హోమ ముల్ = ఎంతో యిష్టంబౌ బలిపీఠము - మీఁద - నెన్నో కోడెల జనులర్పించు తురు || దహనం||
- మల్లెల దావీదు
No comments:
Post a Comment