10
దేవుని ప్రేమ
రా - జంఝూటి, తా - ఆది
ఎంత ప్రేమ యెంత ప్రేమ యెంత ప్రేమయా - దేవుఁ = డెంత గొప్ప ప్రేమయై వెలుంగుచుండునే || ఎంత ||
1.ఎంత లోతు ఎంత నిడివి యెంత విరివయా - దాని = నింత యంతయని వచించు మనుజుఁ డెవ్వఁడు ||ఎంత||
2.మనమునఁ దలపోయ నూహకంద దెంతయున్ - దానిఁ = జనువుఁగ జగమందుఁ బొగడ మాట లందవే ||ఎంత||
3.దేవదూతలైన దానిఁ బాడలేరట - యింక = దేవుఁడే తన సుతు నొసంగి ఇంత యది యనెన్ || ఎంత||
4.ఇంత గొప్ప ప్రేమఁ జూప నూరకుందునే - ప్రభు = జెంతఁజేరి సంత తంబు ప్రీతిఁ జేసెదన్ || ఎంత ||
No comments:
Post a Comment