ఎందుకింక కన్నీరు - ఎందుకావేదన - నీ దుఖః దినములన్ని సమాప్తమైనవని - తెలుసుకో నేస్తమా - యేసయ్య మాటిది (2)
1. పరలోక మహిమను - నీ కొరకు విడిచెను -
తన ప్రాణం పెట్టి - నిన్ను బ్రతికించెను (2)
ఇంత చేసినవాడు - నీకు దురమౌతాడా -
సందేహమును వీడి - సిలువ దర్శనము పొంది
బ్రతికితే క్రీస్తు కొరకు - చావైతే లాభమనుకో (2)
ప్రాణమా నాలో తొందర పడకుమా(2) ||ఎందుకింక||
2. మన్ను అడ్డు ఉందని - మొలకెత్తకుందువా -
రాళ్ళు రువ్వుతారని - భరించకుందువా (2)
ఎండిన భూమిలో - మొలిచిన మొక్కవలె -
పెరిగెను యేసయ్య - ద్రాక్షవల్లిగా
అంటు కట్టబడి నీవు - బహుగా ఫలించుమా (2)
ప్రాణమా నాలో తొందర పడకుమా(2) ||ఎందుకింక||
3. అపజయముల మధ్య - వెనుకంజ వేయకుమా - పోరాడుచున్నది - అంధకార శక్తులతో (2)
దేవుడిచ్చు సర్వాంగకవచమును - ధరించుకుని -
ధూపర్తి చేబూని - స్తుతి యాగము చేయుచు
జయమే ఊపిరిగా - గురియొద్ధకే సాగిపో (2)
ప్రాణమా నాలో తొందర పడకుమా (2) ||ఎందుకింక||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment