Yesuni Rupamloniki Marali |యేసుని రూపంలోనికి మారాలి

యేసుని రూపంలోనికి మారాలి - యేసుని మాదిరి మనకు రావాలి
ఇదే ప్రభుని నిర్ణయం – ఇదే ప్రభుని పిలుపు
ఇదే ప్రభుని నీతి - ఇదే ప్రభువుకు మహిమ 

1. యేసుతో నడావాలి - యేసు ప్రేమను చాటాలి
యేసు త్యాగం చూపాలి - యేసు సహనం చాటాలి
యేసే లోక రక్షణని - జనులందరికి చాటించు 
అన్య జనులందరికి చాటించు 

2. యేసు కొరకు జీవించు - యేసు మార్గం పయనించు 
యేసు నీతిని పాటించు - యేసు మాటలు నెరవేర్చు
యేసు లేని జీవితమే - నరకమని ప్రకటించు 
ఘోర నరకమని ప్రకటించు

No comments: