యెహోవా కట్టిన ఇల్లు ఇది - మహోన్నతుడు నిర్మించినది
మధురమై - శ్రేష్ఠమై - మరువరాని బంధమిది(2)
1.ఒంటరి బ్రతుకులు మరవాలని -
జంటగ సతతం నిలవాలని (2)
ఒకటిగ చేతులు కలపాలని -
అన్యోన్యతతో మెలగాలని (2)
అన్యోన్యతతో మెలగాలని ||యెహోవా||
2.లోక వాంఛలు విడవాలని -
వాక్య కాంతిలో నడవాలని (2)
దేవుని దయలో ఎదగాలని -
జ్యోతులుగ ఇల వెలగాలని (2)
జ్యోతులుగ ఇల వెలగాలని ||యెహోవా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment