దేవునితో ఉండుటకు బహు దీర్ఘ కాలం - దేవునికై అర్పించవా ఈ స్వల్ప కాలం (2) || విలువైనది ||
1. బంగారు సంపదలను దొంగలెత్తుకెళ్లినా - దొరుకునేమో ఒకనాడు నిరీక్షణతో వెదకినా
నీ కడుపున పుట్టిన కుమారుడు తప్పిపోయిన - నీ కొరకు వస్తాడేమో వెదకుచు ఒక రోజున
పరలోకపు దేవుడు నీకిచ్చిన కాలము (2)
క్షణమైనా వచ్చునా పోయిన నీ కాలము (2) ||విలువైనది||
2. మనిషి సగటు జీవితం డెబ్బది సంవత్సరములు - అధిక బలము ఉన్న యెడల ఎనుబది సంవత్సరములు
ఆయాసము దుఃఖమే నీ కడవరి కాలము - ఆదరించువారు లేని కన్నీటి క్షణములు
దేవునికి క్రీస్తులా అర్పిస్తే ఈ కాలము (2)
దేవునితో క్రీస్తు వలె ఉండెదవు కలకాలము (2) ||విలువైనది||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment