441
సమర్పణము
రా - సౌరాష్ట్ర, తా - ఆట
నావన్ని అంగీకరించుమి - దేవా - నన్నెపుడు నీవు కరుణించుమీ = నావన్ని కృపచేత - నీవలన నొందిన - భావంబునను నేను - బహుదైర్యమొందెద
1.నీకు నా ప్రాణము - నిజముగ నర్పించి = నీకు మీదుగట్టి - నీ కొరకు నిల్పెద ||నావన్ని ||
2.సత్యంబు నీ ప్రేమ - చక్కగా మధి బూని = నిత్యంబు గరముల - నీ సేవ జేసెద ||నావన్ని||
3.నీ సేవ జరిగెడు - నీ ఆలయమునకు = ఆశచే నడిపించు - మరల నా పదముల ||నావన్ని|
4.పెదవులతో నేను - బెంపుగ నీ వార్త - గదలక ప్రకటింప = గలిగించు దృడభక్తి || నావన్ని||
5.నా వెండి కనకంబు - నా తండ్రి గైకొనిమీ = యావంత యైనను - నాశించ మదిలోన ||నావన్ని||
6.నీవు నా కొసగిన - నిర్మల బుద్దిచే = సేవ జేయగ నిమ్ము - స్థిరభక్తితో నీకు ||నావన్ని||
7.చిత్తము నీ కృపా - యత్తంబు గావించి = మత్తిల్ల కుండగ - మార్గంబు దెలుపుము ||నావన్ని||
8.హృదయంబు నీకిత్తు - సదనంబు గావించి = పదిలంబుగా దాని - బట్టి కాపాడుము ||నావన్ని||
- పులిపాక జగన్నాథము
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment