నా హృదయ సీమలో ఆనందగీతిక (2) -
పొంగి పారింది మేని పులకించగ (2)
అ.ప: క్రిస్మస్ గంటలు మ్రోగాయి -
క్రీస్తుని జన్మను చాటాయి
1.ఆశ్చర్యకరుడు - నిత్యుడగు దేవుడు -
ఈ భువిలో ఉదయించ - పుడమికే పండుగ (2)
ఆ దేవుడే గుండె గదిలో జన్మించ (2) -
నా బ్రతుకున అదే నిజమైన పండుగ (2) ||నా హృదయ||
2.గగనాన దూతలు - గళమెత్తి పాడ -
సమాధాన గీతాలు - జనులకు వినిపింప (2)
ఆ యేసు బాలుని - ఆ దివ్యరూపుని (2)
మనసున స్మరియింప - ఉప్పొంగె నా మది (2) ||నా హృదయ||
3.పరలోక సౌఖ్యం - విడనాడి యేసు -
దీనుడుగా ఇలకు దిగి వచ్చినాడు (2)
ఆ రాజువోలె తగ్గింపు కలిగి (2)
తన దివ్య సేవలో సాగుటే ధన్యత (2) ||నా హృదయ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment