Manishiga Puttinodu Mahthmudaina | మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా

మనిషిగా పుట్టినోడు మహాత్ముడైనా - 
మరల మంటిలో కలవవలయురా 
తీసుకొనిపోలేడు పూచికపులైనా - 
ఇల సంపాదన వదలవలయురా
అ.ప: దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకో
    ప్రాణముండగానే నీవు ప్రభుని నమ్ముకో 

1.ఒకేసారి జన్మిస్తే రెండుసార్లు చావాలి - 
ఆరిపోని అగ్నిలో యుగయుగాలు కాలాలి 
క్రీస్తులో పుట్టినోళ్ళు రెండవ మారు - 
స్వర్గానికి ఆయనతో వారసులౌతారు

2.జన్మనిచ్చినవాడు యేసుక్రీస్తు దేవుడే - 
జన్మించక ముందే నిన్నెరిగిన నాధుడే 
ఆయనను నమ్మి పునర్జన్మ పొందితే - 
నీ జన్మకు నిజమైన అర్థముందిలే 

3.నీలో ఉన్న ఊపిరి గాలని భ్రమపడకు - 
చచ్చినాక ఏమౌనో ఎవరికి తెలుసనకు 
నీలోని ఆత్మకు స్వర్గమొ నరకమొ - 
నిర్ణయించే సమయమిదే కళ్ళు తెరుచుకో

No comments: