Koteeshwarulaina Kadu Pedalaina | కోటీశ్వరులైనా కడుపేదలైనా

కోటీశ్వరులైనా కడుపేదలైనా - అందరు కాటికే పోవాలి
అభిమానులేవున్నా అనామకులైనా - అందరు అంతమైపోవాలి
దిగంబరులుగానే వొచ్చాము - దిగంబరులుగానే వెళ్లిపోవాలి
అంతాతిరిగి మట్టికే పోతాము - ఇంతా తెలిసి ఎగిరెగిరి పడతాము||కోటీ||

1. సిరిసంపదలెన్ని కూడబెట్టినా - చిళ్లిగవ్వైనా తీసుకెళ్లలేమని
ఒక్కజేబుకూడాలేని ప్రేతవస్త్రం - చాటేసత్యాన్ని ఎరుగవెందుకు?
భార్యాబిడ్డలా బంధుమిత్రుల బంధం - బ్రతికున్నంతవరకే పరిమితం
చేసిన పనుల ఫలముగ వెళ్లేలోకమే - మన అందరికి శాశ్వతం
ఏదిమన శాశ్వతం ఓ మనసా? ఏది నిజసంపదో అదితెలుసా?||కోటీ||

2. ఆస్తులను అప్పులను - ఐనవారికి విడిచిపెట్టి వెళ్లిపోతాము
పాపపుణ్యాలనే వెంటబెట్టుకునీ - మరో లోకానికి వెళ్లిపోతాము
పాపాలకు శిక్షగా నిత్యయాతనకు - నీతికి ప్రతిగా నిత్యజీవానికెళతాము
పాపముతీసి పరమున చేర్చేయేసే - మన నిజమైనా సంపద
పరమే మనశాశ్వతం ఓ మనసా? క్రీస్తే నిజసంపద అదితెలుసా?||కోటీ||


No comments: