తనవారికైనా పగవారికైనా - పంచును సమత మమత (2)
1.ప్రతి పరిస్థితిని ప్రేమతో - భరించగలిగిన ఓర్పు - ప్రతికూలతను అనుకూలముగా - మార్చేటి నేర్పు(2)
కలిగిన భార్య ఇంటికే దీపము (2)
సంఘమనే ఆ వధువునకు నిజమైన రూపము (2) ||కొనియాడ||
2.తండ్రివలె ఓదార్చి - తల్లివలె సేదదీర్చి - మిత్రునివలె భర్తకు ఎపుడు తోడుగ నిల్చును (2)
దైవజ్ఞానముతో కుటుంబమును నడుపును(2)
రాబోవు వాటి గూర్చి నిశ్చింతగా నుండును (2) ||కొనియాడ||
3.బ్రతుకు దినములన్నియును - భర్తకు మేలే చేయును - దీనులకు దరిద్రులకు తనచేయి చాపును (2)
ఆహారమును తానే సిద్ధపరచును(2) ఇంటివారినందరిని కనిపెట్టుచుండును (2) ||కొనియాడ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment