కళ్యాణం కమనీయం -
ఈ సమయం అతి మధురం
అ.ప: దేవా రావయ్యా -
నీ దీవెనలీవయ్యా (2)
1.ఏదెను వనమున యెహోవ దేవా -
మొదటి వివాహము చేసితివే (2)
ఈ శుభ దినమున - నవ దంపతులను -
నీ దీవెనలతో నింపుమయా (2) ||కళ్యాణం||
2.కానా విందులో అక్కర నెరిగి -
నీళ్ళను రసముగ మార్చితివే (2)
కష్టములలో నీవే - అండగా నిలిచి -
కొరతలు తీర్చి - నడుపుమయా (2) ||కళ్యాణం||
3. బుద్దియు జ్ఞానము సంపదలన్నియు -
గుప్తమై యున్నవి నీయందే (2)
ఇహపర సుఖములు - మెండుగ నొసగిన -
ఇల వర్దిల్లగ జేయుమయా(2) ||కళ్యాణం||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment