బెత్లేహేము పురమునందు చిత్రమాయెనంట
కర్తయేసు బాలుడుగా జననమాయెనంట
అంధకారమైన.. ఆకస వీధులలో.. ఆనందపు మహిమ చోద్యమేమిటోనంట (2) ||బెత్లేహేము||
1.పరమ పురమే వదలి పావనుండు యేసు -
నరజాతిని ప్రేమించి ఇలకు దిగెనంట (2)
ఇమ్మానుయేలుగా - నెమ్మది నీయగా (2) -
కన్నె మరియ గర్బాన పుట్టెనంట చూడరండి ||బెత్లేహేము||
2.గొల్లలేమో వార్త విని - గొర్రెలనే వదలి -
మెల్లగా అందరికి చాటి చెప్పిరంట (2)
దావీదు పురములో - లోకరక్షకుడుగా (2)
యేసయ్య జనియించిన సంబరమే కనరండి ||బెత్లేహేము||
3.సర్వోన్నత స్థలములలో దేవునికి మహిమ-
ఇష్టులైన మనుష్యులకు సమాధానమంట (2)
రెక్కలు చాచి - చక్కనైన దూతలు (2)
మధురమైన పాటలెన్నో పాడుచుండ వినరండి ||బెత్లేహేము||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment