ఉరకలు వేసే ఉత్సాహం ఉల్లమునే నింపిన రోజు (2)
ఇది నీ పుట్టినరోజు - మనసైన వేడుక రోజు(2)
Happy birthday to you (2)
1.గడచిన సంవత్సరములుగాచిన దేవుని స్తుతియించాలి -
ఎడబాయక నిను కాపాడిన ప్రభు ప్రేమను మదినుంచాలి (2)
ఆయన చేసిన మేలుల బట్టి కృతజ్ఞత చూపించాలి (2)
జీవితమంతా యేసుని కొరకు సాక్షిగ జీవించాలి (2) ||అవధులు||
Many greetings to you ( 2 )
2. రాబోయే వత్సరములు కృపయు క్షేమం నీతో రావాలి -
ఈలాటి పుట్టినరోజులు నీవెన్నో చేసుకోవాలి (2)
నీదు జీవితం అనేకులకు దీవెనకరమై సాగాలి (2)
నీ గృహమే స్వర్గముగా ధరలో సిరులతో తులతూగాలి (2) ||అవధులు||
May God bless you dear (2)
3. అడుగు పెట్టిన ప్రతి స్థలములో ఆశీర్వాదం కలగాలి -
మొదలు పెట్టిన పనులన్నిటిలో విజయముతో వెలగాలి (2)
ఉన్నతమైన శిఖరాలెన్నో నీ వధిరోహించాలి (2)
చదువులు,పదవులు వ్యాపారములో వృద్ధిని సాధించాలి (2) ||అవధులు||
Happy long life to you (2)
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment