యేసయ్యా ప్రియమైన మా రక్షకా -
నీదు ప్రేమకై స్తుతియింతుము (2)
నిన్ను పూజింతుము - నిన్ను సేవింతుము (2)
నిన్ను మనసార స్మరియింతుము ||యేసయ్యా||
1. ఆదియాదాము చేసిన పాపమున మునిగియున్న పాపులను (2)
నీదు శరీరము బలిగా చేసి (2) విలువైనవారిగా చేసితివి (2) ||యేసయ్యా||
2. నిద్రించుచున్న పాపులనెల్లను రక్షణ వివరించి లేపితివి(2)
నీ కరుణను ఇల వర్షింపజేసి(2) సిలువ పై ప్రాణము వీడితివి(2) ||యేసయ్యా||
- డా.ఎ.డి. శిఖామణి
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment