Vandaname Yesunaku | వందనమే యేసునకు వరుసుగుణో

74                 
క్రీస్తునకు మంగళార్చన
రా - ఆనందభైరవి,  తా - ఆది
(ఛాయ: మంగళమే యేసునకు)

వందనమే యేసునకు - వరుసుగుణోదారునకు = సౌందర్య ప్రభువునకు - సర్వేశ్వర నీకు ||వందనమే||

1.యెహోవా తనయునకు - ఇమ్మాను యేలునకు - బహు కరుణాభరణునకుఁ ప్రభువుల ప్రభువునక ||వందనమే||

2.ఆశ్రిత జనపాలునకు - నకలుష వర దేహునకు = ఇశ్రాయేల్ రాజునకు - యెహోవా నీకు ||వందనమే||

3.మరియాతనూజునకు - మహిమ గంభీరునకు = పరిశుద్ధా చరణునకుఁ - బరమేశ్వర నీకు ||వందనమే||

4.రాజులపై రాజునకు - రవికోటి తేజునకు = పూజార్హ పదాబ్జునకు - భువనావన నీకు ||వందనమే||

5.ప్రేమ దయా సింధునకు - క్షేమామృత పూర్ణునకు = ఆమే నని సాష్టాంగము - లర్పింతుము నీకు ||వందనమే||  
                             - పురుషోత్తమ చౌదరి

No comments: