Sarvadeshamulara Sri Yese | సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు

69
దైవ స్తుతి
రా - శంకరాభరణం,తా - ఆది

సర్వదేశములారా - శ్రీ యేసే దేవుండు = ఉర్వి నుత్సాహముతో - గురుస్తోత్రము జేయను రండి ||సర్వ||

1.ఆ ప్రభువే దేవుండు - అధికస్తోత్రార్హుండు = భూప్రజలు నందరిని - బుట్టించిన భగవంతుండు||సర్వ||

2.మనము దేవుని వార - మును మరి యాయన ప్రజల = మనయము నా ఘనప్రభువు - నెనరుతో మేపెడి గొఱ్ఱెలము||సర్వ||

3.కృతజ్ఞతార్పణలు - కొల్లగను జెల్లింప = నాతని యావరణములో - నతి వినయముతోఁజేరండి||సర్వ||

4.ఆయన దయామయుఁడు - ఆయన కృపామయుఁడు = ఆయన ప్రేమ సత్యం - బనవరతం బుండును నిజమే ||సర్వ||

5.శుభనామం మదినుంచి -  ప్రభునామం స్తుతియించి = ఘననామం బతిభక్తిన్ - అనయము గొలువుడి జనులారా||సర్వ||

6.పితృపుత్రాత్మకును - ప్రియ మహిమ మగుగాక = ఆదిని నుండినరీతి - ననవరతంబుండును గాక || సర్వ ||
                       - నరెళ్ల నమూయేలు సుబ్బయ్య 
DOWNLOAD MP3 SONG HERE 👇

No comments: