ప్రేమసాగరా సిల్వయాగం చేసినావయ్యా
నీ కృప చూపినావయ్యా
యేసుదేవరా నీదు త్యాగం మరువలేనయ్యా -
నీ ఋణం తీర్చలేనయ్యా
1.నాదు బ్రతుకులో శాంతి లేక బ్రతుకె బరువుగా మారిపోయెను (2)
భారమైన సిలువ మోసి (2)
శ్రమలనోర్చితివి - నాదు వ్యధలు తీర్చితివి ||ప్రేమసాగరా||
2.ఎంత వెదకినా కొంచెమైనా - నాలో స్వస్థత లేకయుండెను (2)
గాయములు నా కొరకు పొంది(2)
రక్తము కార్చితివి - నన్ను శుద్ధి చేసితివి ||ప్రేమసాగరా||
3.నాదు పాపం ఘోరశాపం - నన్ను మృతునిగ మార్చివేసెను (2)
హీనమైన మరణమొంది(2)
తిరిగిలేచితివి - నాకు జీవమిచ్చితివి ||ప్రేమసాగరా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment