నిరపరాధి సిలువ పైనమరణమాయెను-
నిలువలేక సూర్యుడే చీకటాయెను (2)
చూడలేక తల్లి మనసు తల్లడిల్లినా -
పాపజనుల గుండెలే కరుగవాయెనా - కరుగవాయెనా ||నిరపరాధి||
1.హింసలెన్ని పెట్టినా పలుకడాయెను -
బాధించు యూదులన్ క్షమియించెను (2)
అనాధయిన తల్లిని ఓదార్చెను
యోహానుకు ప్రేమతో అప్పగించెను - అప్పగించెను ||నిరపరాధి||
2. రక్షణార్థమై దేవుడు చేయి వీడెను -
స్వంత కొమరునికే ముఖము చాటు చేసెను (2)
పాప ప్రజల బ్రతుకులో వెలుగు చూపెను -
అప్పగించిన పనిని పూర్తిచేసెను - పూర్తిచేసెను ||నిరపరాధి||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment