నీ సిలువ శ్రమలు ధ్యానించాలని -
నీ సముఖములో తరించాలని (2)
మాలిన్యమునకు దూరంగా - నీష్టమైన యాగంగా
జీవితం మలచుకోవాలనే - పవిత్ర సాధన దీక్ష -
ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష
1.మానవపాప పరిహారార్థం భువికేతెంచిన నీవు -
సిలువను మోసి మరణమునొంది నీపని ముగించినావు (2)
నా సిలువను నేనెత్తుకొని - నన్ను నేను తగ్గించుకొని (2)
నీ అడుగులలో నడవాలనే - పవిత్ర సాధన దీక్ష -
ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష ||నీ సిలువ||
2.లోక పాపాలగూర్చిన బాధతో రక్తమాయె నీ స్వేదం-
గెత్సెమనెలో మోకాళ్ళ పైన మ్రోగెను ప్రార్థననాదం (2)
నా పాపక్రియలకొరకై నే - పశ్చాత్తాప హృదయముతో(2)
ఆత్మీయ వసంతం పొందాలనే - పవిత్ర సాధన దీక్ష - ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష ||నీ సిలువ||
3.పరోపకారమే ఆహారంగా ఇలలో జీవించినావు -
ప్రేమ కలిగియుండుమని బోధించి - మాదిరి చూపించినావు (2)
శత్రువుకై ప్రార్థించిన - అందరికి మేలు చేసిన
నీ మనసు కలిగియుండాలనే - పవిత్ర సాధన దీక్ష -
ఇది సిలువ దీక్ష - స్వపరీక్ష ||నీ సిలువ||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment