మేడున్నా మిద్దున్నా - పెద్ద గద్దె మీద నీవున్నా -
నీలో యేసన్న లేకున్నా -నీకున్నదంతా సున్నా (2)
1.సిరి ఉందని తూలనాడినా -
బలముందని విర్రవీగినా (2)
తీర్పునందు చిక్కెదవన్నా -
మార్పునొంద త్వరపడుమన్నా (2) ||మేడున్నా||
2.అందముతో అతిశయించినా -
సుందరునని గర్వించినా (2)
చివరకు ఇది మన్నగునన్నా -
ఆపై నీ గతి ఏమన్నా (2) ||మేడున్నా||
3.చదువులలో శిఖరమెక్కినా -
పదవులలో పైకి ఎదిగినా (2)
హృదయం ప్రభుకీయకున్నా -
నరకమే గతి ఇది నిజమన్నా (2) ||మేడున్నా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment