ఎన్నెలో ఎన్నెలా - కన్నుల్లో ఎన్నెలా
ఏసయ్యను నమ్ముకుంటే - ఎన్నెలో ఎన్నెలా(2)
ఆ సామిని కొలుసుకుంటే - బతుకంతా ఎన్నెలా
1.పరలోకం నుండి దొరా నరలోకం వచ్చిండు (2)
మన సీకటి బతుకుల్లో ఎలుతురే తెచ్చిండు (2) ||ఎన్నెలో||
2.సెంతజేరినోళ్ళకంత సింతలన్ని బా పెనంట(2)
ఎంతటి రోగాలైనా సిటికెలో తీసేసెనంట (2) ||ఎన్నెలో||
3.సొరగానికి దారిసూప అడుగుబెట్టె భూమిమీద(2)
మరణానికి బుద్ది సెప్ప కన్నుమూసే సిలువ మీద (2) ||ఎన్నెలో||
4.సక్కనయ్య మోముజూడ సిక్కులన్ని తీరిపోవు (2)
మక్కువతో శరణువేడ బతుకంతా మనలగాయు(2) ||ఎన్నెలో||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment