దేవాది దేవా ప్రభువుల ప్రభూ
రాజుల రాజా హల్లెలూయ
1. నీ రక్తముతో విమోచించి -
నీ రక్తముతో సంపాదించి
పరలోక రాజ్య ప్రజలతో జేర్చి -
పరలోక పాటన్ నా కొసగితివి ||దేవాది దేవా||
2.జీవిత నావలో తుఫాను రేగ -
భయపడకుడని అభయము
జయప్రదముగా నన్ను నడిపించి -
జయజీవితము నా కొసగుచున్న ||దేవాది దేవా||
3. పేరు పెట్టి నన్ ప్రేమతో పిలచి -
కరుణతో నీ సొత్తుగా నన్ను
అరమర లేక నన్నాదరించి -
పరలోక దర్శనంబిచ్చితివి ||దేవాది దేవా||
4. మరణ పాత్రులం యిధరణిలోన -
దురిత ఋణముల స్మరణను మాన్పి
ఏర్పరచుకొంటివి నేర్పుతో మమ్ము -
నీ రాజ్యమందు రాజులన్ ||దేవాది దేవా||
5. శోధనగాధల కష్టములలో -
నా దుఃఖములలో నే నేడ్వకుండా
నీ దయ నాపై నిండార నింపి -
ఓదార్చి నన్ను నీ దారినడుప ||దేవాది దేవా||
6. ప్రతి వత్సరము దయతోడ నింపున్ -
ప్రభు జాడలు సారము జల్లున్
ప్రతి బీడునూ సారము చిలకన్ -
ప్రతి పర్వతము ఆనందించున్ ||దేవాది దేవా||
7.పరలోక పరశుద్ధ సంఘంబు యెదుట -
సర్వశక్తిగల క్రీస్తుని యెదుట
పరలోక నూతన గీతము పాడ -
జేర్చితివి నన్ నీ జనమునందు ||దేవాది దేవా||
DOWNLOAD MP3 SONG HERE 👇
No comments:
Post a Comment